వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ఎప్పుడూ మత్తులోనే ఉంటాడు: బోండా ఉమ

  • నిమ్మగడ్డ ఏం పీకుతాడని కొడాలి నాని అన్నాడు
  • వైసీపీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు రావని జోగి రమేశ్ బెదిరిస్తున్నాడు
  • వైసీపీ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు
వైసీపీ నేతలపై టీడీపీ నేత బోండా ఉమ మండిపడ్డారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఏం పీకుతాడని మంత్రి కొడాలి నాని అన్నారని దుయ్యబట్టారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ఎప్పుడూ తాగి ఉంటాడని అన్నారు. వైసీపీ మద్దతు ప్రకటించే అభ్యర్థులకు ఓటు వేయకపోతే... ప్రభుత్వ పథకాలు రావని జోగి రమేశ్ బెదిరిస్తున్నారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ చేసిన అక్రమాలపై రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రి, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం ఏకగ్రీవాలు చేసుకోవాలని వైసీపీ టార్గెట్ గా పెట్టుకుందని... ఈ క్రమంలోనే అధికార యంత్రాంగాన్ని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని అన్నారు. విజయవాడలో పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మహిళా అభ్యర్థులపై కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలకు వత్తాసు పలికే అధికారులు ఇబ్బందులు పడతారని ఉమ అన్నారు.

Bonda Uma
Telugudesam
Jogi Ramesh
Kodali Nani
YSRCP

More Telugu News